సాయిబాబా ఆలయానికి 14.54 కోట్ల విరాళాలు వచ్చాయి: ప్రతీది మీరు తెలుసుకోవాలి

సాయిబాబా ఆలయానికి 14.54 కోట్ల విరాళాలు వచ్చాయి: ప్రతీది మీరు తెలుసుకోవాలి

సాయిబాబా ఆలయానికి 14.54 కోట్ల విరాళాలు వచ్చాయి: ప్రతీది మీరు తెలుసుకోవాలి

 

 

సాయి భౌతికంగా ఉన్న సమయంలో ఆయనకు అనేక మంది అనుచరులు ఉండేవారు. కాలక్రమేణా సాయి బాబా భక్తుల సంఖ్య పెరిగింది. సాయి ప్రేమకు అవధులు లేవు. ప్రసిద్ధ షిర్డీ సాయి ఆలయానికి కేవలం 11 రోజుల్లోనే విరాళాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. 

 

షిర్డీ సాయి ఆలయ విరాళాలు 

షిర్డీ ఆలయానికి సాయి అనుచరుల నుండి మొత్తం 14.54 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శ్రీ చంద్రశేఖర్ కదమ్ వివరాల ప్రకారం, కేవలం ఆలయంలోని విరాళాల పెట్టెల నుంచి 8.05 కోట్లు వచ్చాయి. ఇవి కాకుండా, భక్తుల పాస్‌లు మరియు ఆన్‌లైన్ దర్శన సేవల ద్వారా షిర్డీ సాయిబాబా ఆలయ ట్రస్ట్ 3.63 కోట్లు పొందింది.

 

ఇది సాయిబాబా అనుచరుల పరిమాణాన్ని తెలియజేయకపోతే, ఈ రోజు భారతీయ సంస్కృతి మరియు విశ్వాసాలపై సాయిబాబా చూపిన ప్రభావాన్ని ఈ బ్లాగ్ ద్వారా వివరించడానికి ప్రయత్నిస్తాను.

 

సాయిబాబా ఎవరు? 

సాయిబాబా ఒక ఆధ్యాత్మిక నాయకుడు, సుమారు 1838 సంవత్సరంలో జన్మించారు, సాయి ఖచ్చితమైన పుట్టిన తేదీపై ఇప్పటికీ చర్చ్ జరుగుతూనే ఉంది. ఆయన 1858లో షిరిడీకి వచ్చారు, దేహాన్ని వీడేవరకు ఆయన అక్కడే ఉన్నారు. ఆయన బోధలలో స్వీయ విలువ గుర్తించుకునేలా ఉంటాయి మరియు భౌతిక ఆస్తుల పట్ల ప్రేమను ఆయన ఖండించారు. కులం, మతం మరియు సంపద ఆధారంగా విభజనకు వ్యతిరేకంగా బలమైన వైఖరిని సాయి తీసుకున్నారు. ఆయన "ద్వారకామాయి" అనే మసీదులో నివసించారు మరియు షిర్డీ నివాసుల నుంచి బిక్ష అడుగుతూ జీవించారు.

 

సాయిబాబా ఎందుకు అంత ప్రసిద్ధుడు? 

మనుషులకు ఉండే కోరికలను విడిచిపెట్టి సాయి సామాన్యంగా జీవించారు. ఆయన భక్తులు రాని ఓ పాత మసీదులో నివసించారు మరియు షిర్డీ నివాసితుల నుండి "భిక్ష" అడుగుతూ జీవించారు. సాయి గురించి తెలియని వారు సాయి ఎందుకు అంత ప్రసిద్ధి చెందారు అని ఆశ్చర్యపోతుండేవారు. సాయి మంచి వ్యక్తిగా ఉండటమే కాదు; ఆయన నిరాశలో, బాధల్లో ఉన్న తన అనుచరులకు, సహాయం కోరిన వారికి సహాయం చేశారు. ఎన్నో అద్భుతాలు చేశారు. ప్రజలను సరైన మార్గంలో నడిపించారు. అసలు సాయిబాబా గురించి తెలిసిన వారెవరూ సాయి సన్నిధి తెచ్చిన శాంతిని వ్యతిరేకించలేరు.


 

సాయిబాబా షిర్డీకి మరియు సమాజానికి ఎలా సహాయం చేసారు? 

అయన అనుచరుల చెప్పిన ప్రకారం, ప్రతి ఒక్కరూ ధనవంతులు మరియు విజయాలు సాధించాలనే ఉద్దేశ్యంతో ఉన్న ఈ ప్రపంచంలో.. మంచి వ్యక్తులుగా ఉండటానికి సాయి వారికి ఒక కారణాన్ని అందించారు.

 

  • భౌతిక ఆస్తులన్నీ అర్థరహితమైనవని మరియు అవి వారి ఒత్తిడిని మరియు అభద్రతను పెంచుతాయని ప్రజలు గ్రహించడంలో ఆయన సహాయం చేశారు.
  • ఆయన తన భక్తులకు జ్ఞానోదయం వైపు అనుసరించడానికి స్పష్టమైన మార్గాన్ని కూడా ఇచ్చారు.
  • ఆయన శరీరాన్ని వీడిన తరువాత కూడా, ఆయన తనను ప్రార్థించే వారందరికీ నైతిక మద్దతును అందిస్తారు.
  • ప్రజలలో అందరం ఒక్కటే అన్న భావాన్ని పెంపొందించడంలో ఆయన దోహదపడ్డారు.
  • ప్రజలను వారి కులం, మతం లేదా సంపద ఆధారంగా అంచనా వేయకూడదని ఆయన మనకు బోధించారు.



 

సాయిబాబా వార్తల గురించి మీరు ఎలా అప్‌డేట్‌గా ఉండగలరు? 

మీరు సాయిబాబా వార్తల నవీకరణలను కనుగొనగలిగే అనేక వెబ్‌సైట్‌లు ఇంటర్నెట్‌లో ఉన్నాయి. అయితే ఇందులోని అతి ముఖ్యమైన అంశం కచ్చితమైన సమాచారాన్ని సేకరించడం. కాబట్టి, మీ జీవితాన్ని కొంచెం సులభతరం చేయడానికి, సాయిబాబా గురించి మరింత చదవడానికి మరియు మరింత తెలుసుకోవడానికి మీకు అనువైన సైట్‌ని నేను కనుగొన్నాను. సాయిబాబా గురించిన సాధారణ బ్లాగ్‌లు మరియు వార్తల నవీకరణల కోసం, సాయిబాబా న్యూస్ ను ఫాలో అవ్వండి.

 

Latest RERA News

© 2020 Sai Baba. All rights reserved | Design by OpenDG.